![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -980 లో.. కాలేజీ బోర్డు మెంబర్స్ అందరు కాలేజీలో ఈ సంవత్సరం యూత్ ఫెస్ట్ జరుపాలని మీటింగ్ లో చెప్తారు. ఇప్పుడు ఎందుకు తర్వాత కండక్ట్ చేద్దామని వసుధార అనగానే.. లేదు మేడమ్.. ఎప్పుడు ఇదే టైమ్ కి ఫెస్ట్ జరుగుతుందని మెంబర్స్ అంటారు. ఆ తర్వాత ఫణీంద్ర కలుగజేసుకుని.. అవును ఇప్పుడు కాలేజీలో ఫెస్ట్ నిర్వహిస్తే.. వేరే కాలేజీ వాళ్ళు ఇక్కడికి వస్తారు.. మన కాలేజీ గురించి పబ్లిసిటీ జరుగుతుంది. ఒకరకంగా ప్రమోషన్ లాగా అవుతుంది. ఇప్పుడు చేస్తే బెటర్ అని అంటాడు.
ఆ తర్వాత వసుధార కూడా ఫెస్ట్ కి ఒప్పుకుంటుంది. గెస్ట్ గా మినిస్టర్ గారిని పిలుద్దామని ఫణింద్ర చెప్తాడు. దానికి అందరూ ఒకే చెప్తారు. ఆ తర్వాత వసుధార తన కాబిన్ కీ వచ్చి.. జగతి మేడమ్ ని గుర్తుకు చేసుకుంటుంది. అప్పుడే మహేంద్ర వచ్చి.. నువ్వు ఇప్పుడు ఎంత స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నవ్ కదా.. నాకు తెలుసని మహేంద్ర అంటాడు. నాకు రిషి సర్ కోలుకున్నాక ఇది జరపాలని ఉండే కానీ అందరు చెప్పింది కూడ కరెక్ట్ అని వసుధార అంటుంది. ఆ తర్వాత వసుధార గురించి శైలేంద్ర ఆలోచిస్తు.. ఎన్ని ప్లాన్ లు చేసిన మళ్ళీ నాది నాకే రివర్స్ అవుతున్నాయేంటి? ప్రతీసారీ ఆ వసుధారనే గెలుస్తుంది. ఇక అలా ఉండదు. ఇప్పుడు నాకు తోడు ఆ రాజీవ్ దొరికాడు. వాడికి ఆ వసుధార కావాలి, నాకు తాను కూర్చొని ఉన్న ఎండీ సీట్ కావాలని శైలేంద్ర అనుకుంటాడు. ఆ తర్వాత రాజీవ్ మాస్క్ పెట్టుకొని డెలివరీ బాయ్ లాగా వసుధార ఇంటికి వస్తాడు. డోర్ కొట్టగానే వసుధార బయటకు వస్తుంది. నేనేం ఆర్డర్ చెయ్యలేదని వసుధార అనగానే ఇంట్లో వాళ్ళు చేశారేమోనని రాజీవ్ అంటాడు. సరే అని వసుధార ఆర్డర్ తీసుకుంటుంది. అలా ఎదో వంకతో వసుధార చెయ్యిని టచ్ చేస్తాడుమ ఆ తర్వాత రాజీవ్ తిరిగి వెళ్లిపోతుంటే వసుధార ఆగమని చెప్తుంది. నిన్ను ఎక్కడో చూసినట్టు ఉంది.. మాస్క్ తీయమని అనగానే రాజీవ్ భయపడుతాడు. ఎదో ఒకటి కవర్ చేసి అక్కడ నుండి బయటపడతాడు.
మరుసటి రోజు ఉదయం వసుధార స్టూడెంట్స్ కి ఫెస్ట్ కి సంబందించిన బాధ్యతలు అప్పజెప్పుతుంది. అలా స్టూడెంట్స్ తో మాట్లాడుతున్న వసుధారని శైలేంద్ర చూసి.. వసుధార వస్తుండగా ఇంత హుషారుగా కన్పిస్తున్నావ్.. ఈ ఫెస్ట్ అట్టర్ ప్లాప్ అవుతుందని తనకి కోపం వచ్చేలా మాట్లాడతాడు. దానికి తగ్గట్టు వసుధార కూడ శైలేంద్రకి కౌంటర్ వేస్తుంటుంది. ఆ తర్వాత వసుధార, శైలేంద్ర మాటలన్ని మహేంద్ర, అనుపమలకి చెప్తుంది. వాడు మనం ఏం అనడం లేదని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడని మహేంద్ర అంటాడు. మీరు ఫణింద్ర, రిషీలకి వాడి గురించి చెప్పాలిసిందని అనుపమ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |